Andhra PradeshHome Page Slider

విద్యార్థులకు అదనపు తరగతులు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వ కళాశాలలకు, అనుబంధ కళాశాలలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం తరగతులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఉండగా, తాజాగా సాయంత్రం 5 గంటల వరకూ పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఇంటర్ సిలబస్‌తో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులకు ప్రిపేర్ చేసేందుకు అదనపు తరగతులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.