Home Page SliderNational

అదానీ మోదీ బినామీ.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

అదానీ కంపెనీ.. మోదీ సొంత కంపెనీ అన్నారు కేటీఆర్. గౌతమ్ అదానీ ప్రధాని మోదీ బినామా కాదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ-మోదీ చీకటి స్నేహం తెలియదని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చినా స్పందించారా అన్నారు. అదానీకి చెందిన ముద్ర పోర్టులో హెరాయిన్ దొరికిందన్నారు. 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికితే కేసులుండవా అని ప్రశ్నించారు. అదానీని విచారణకు పిలిచే దమ్ముందా అన్నారు కేటీఆర్. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ… ఈడీ తోలుబొమ్మ అంటూ, కేటీఆర్ దుమ్మెత్తిపోశారు.

నిబంధనలను కాదని 6 ఎయిర్ పోర్టులు అదానీకి ఇవ్వడం స్కామ్ కాదా అన్నారు కేటీఆర్. అదానీ నుంచి బొగ్గు కొనాలని పాలసీ తేవడం స్కామ్ కాదా అన్నారు. ఎమ్మెల్యేలను కొనబోయి దొరికిపోయిన బీఎల్ సంతోష్‌లా తాము స్టే తెచ్చుకోబోమన్నారు కేటీఆర్. కవిత కేసు మొదటిది కాదు.. చివరిది కాదు.. ఇంకా చాలా మంది మా పార్టీ వాళ్లను వేధిస్తారన్నారు