BusinessHome Page SliderInternational

అదానీ నెత్తిన పిడుగు

అదానీ గ్రూప్ ఛైర్మన్, భారత కుబేరుడు గౌతమ్ అదానీ నెత్తిన పిడుగు పడినట్లయ్యింది. ఆయనపై అమెరికాలో బిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అదానీకి చెందిన కంపెనీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వజూపిందని, పైగా ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించిందని న్యూయార్క్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపణలు చేశారు. గౌతమ్ ఆదానీతో పాటు ఆయన బంధువులు ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదానీ, దాని అనుబంధ సంస్థలు సౌరశక్తి సరఫరా ఒప్పందాల కోసం సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఆఫర్ చేశారని వీరు ఆరోపిస్తున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అక్రమ మార్గాల ద్వారా 3 బిలియన్ డాలర్ల రుణాలు, బాండ్లు సేకరించిందని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపుతున్నారు. ఈ విషయాలపై దర్యాప్తు జరపాలని, కంపెనీలపై ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.