మీడీయా రంగంతో..అదానీ భారీ డీల్
ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ దేశంలో మరొక భారీ డీల్‌కు శ్రీకారం చుట్టారు. అదానీకి చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ తాజాగా ఎన్డీటీవీని కొనుగోలు చేసింది. ఈ మీడియా గ్రూప్ ఎన్డీటీవీలో (NDTV)29.18% వాటాను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ మీడియా స్వయంగా ప్రకటించింది. ఈ కొనుగోలుకు సంబంధించిన వివరాలను మీడియా ఇనిషియేటివ్స్ అదానీ ఎంటర్ ప్రైజెస్ CEO, ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ పుగాలియా వెల్లడించారు. AMG మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్(AMNL)కి అనుబంభ సంస్థ అయిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) ద్వారా పరోక్షంగా NDTVలో 29.18% కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ తెలిపింది.

అయితే ఈ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (AEL) యాజమాన్యం నడిపిస్తోంది. వీళ్ళు కొనుగోలు చేసిన NDTV భారత దేశంలో గత మూడు దశాబ్దాలుగా మీడియా రంగంలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా విశ్వసనీయమైన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ ఉంటుంది. ఈ మేరకు ప్రజాభిమానాన్ని బాగా చురగొన్న ప్రముఖ మీడీయా సంస్థగా ఇది పెరుగాంచింది. ఈ కంపెనీ ప్రస్తుతం మూడు వార్తా ఛానెల్స్‌ను నిర్వహిస్తోంది. అవి ఏవనగా-NDTV 24*7,NDTV ఇండియా,NDTV ప్రాఫిట్. ఈ విధంగా ఇది భారత దేశంలోనే బలమైన ఆన్‌లైన్ వ్యవస్థను కలిగి ఉంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో 35 మిలియన్లకు పైగా అనుచరులను సంపాదించుకుంది. దేశంలో అత్యధికంగా అనుసరించే వార్తల హ్యాండిల్స్‌లో ఇది ప్రథమ స్థానంలో ఉంది. NDTV INR 123 కోట్లు,EBITDA తో INR 421 కోట్ల ఆదాయాన్ని,FY22లో INR 85 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ అతి తక్కువ అప్పులతో కొనసాగుతోంది.

