National

విదేశీ పెట్టుబడులపై అదానీ గ్రూప్ కన్ను

ఓడరేవులు, విమానాశ్రయాలు, సిమెంట్, గ్రీన్ ఎనర్జీ, డాటా సెంటర్లు, తదితర వ్యాపారాలలో బాగా జోరుగా ఉన్న అదానీ గ్రూప్ త్వరలో విదేశీ పెట్టుబడులతో మరింత విస్తరించనుంది. బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార విస్తరణలో భాగంగా సింగపూర్ పెట్టుబడి సంస్థలైన టెమాసెక్, సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీతో సహా పలు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ కుటుంబ సభ్యులు, టాప్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. రాబోయే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ గత నెలలో ప్రకటించారు. వీటిలో ఎక్కువ భాగం న్యూ ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్ విభాగంలో పెట్టబోతున్నట్లు తెలియజేశారు. ప్రపంచంలోనే మూడో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్న అదానీ సంపద 143 బిలియన్ డాలర్లకు చేరింది.