నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నియామకం
తన ఫోన్ టాపింగ్ చేశారనే ఆరోపణలతో వైసీపీ అధిష్టానంపై విరుచుకుపడిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ తప్పించింది. ఆయన స్థానంలో నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా కొనసాగుతున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
