విడాకులపై కేటీఆర్‌తో ముడిపెట్టిన మంత్రిపై నటి సమంతా ఫైర్…
నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడంలో రాజకీయ పాత్ర ఉందంటూ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత రూత్ ప్రభు స్పందించారు. రాజకీయ పోరాటాల కోసం ఆమె పేరును వాడుకోవద్దని సమంత కోరారు. ఆమె విడాకుల విషయం గోప్యతగానే ఉంచాలని కోరింది. తన విడాకులు పరస్పరం, సామరస్య పూర్వకమైనవని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇంతకుముందు మంత్రి వ్యాఖ్యలను నాగ చైతన్య తండ్రి, నటుడు నాగార్జున కూడా ఖండించారు.