అలాంటి చిత్రాలు చూడమన్నారు..
నటి మిను మునీర్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించారంటూ హీరో జయసూర్య సహా పలువురు మలయాళ సినీ ప్రముఖులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మిను మునీర్. దర్శకుడు బాలచంద్ర మీనన్ సైతం తనను లైంగికంగా వేధించారని ఆమె సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. 2007లో నన్ను తన గదికి పిలిపించుకున్న బాలచంద్ర అశ్లీల చిత్రాలు చూడాలని బలవంతం చేశారు. “నువ్వు నాకు తోడుగా ఉండాలని అడిగారు, నేను వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చాను” అని ఆమె తెలిపారు. మాలీవుడ్ లో వేధింపులు తట్టుకోలేక తమిళ సినిమాలు చేసుకుంటూ చెన్నైలో ఉంటున్నానని మిను మునీర్ తెలిపారు.

