Home Page SliderNational

నటి కస్తూరికి షాక్

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సీనియర్ నటి కస్తూరిపై పోలీసుకేసులు నమోదయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో మదురై బెంచ్‌లో పిటిషన్ వేశారు. అయితే పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మదురై బెంచ్ కస్తూరిపై వ్యాఖ్యానం చేస్తూ తెలుగు, తమిళ వారిని ఎలా వేరు చేసి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చెన్నైలోని బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొని, తమిళనాడులో తెలుగువారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజుల వద్ద సేవకులుగా పనిచేయడానికి వచ్చి ఇక్కడ తెలుగువారు సెటిల్ అయిపోయారని వ్యాఖ్యానించారు. దీనిపై పలు తెలుగు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో సమన్లు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులు కస్తూరి పరారీలో ఉన్నట్లు గుర్తించారు.