Home Page Slider

పెళ్లి కాకుండానే బిడ్డ… నటి ఇలియానా ఇన్‌స్టా పోస్టుపై దుమారం

బాలీవుడ్, టాలీవుడ్ నటి ఇలియానా డి’క్రూజ్ త్వరలో మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నట్టు ప్రకటించింది. నటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌‌ అటు చిత్ర పరిశ్రమను, సినీ వర్గాలను ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఇలియానా కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందన సందేశాలను షేర్ చేస్తుంటే మరోవైపు ఇలియానా పోస్టుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలియానా ఈవాళ ఉదయం రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. “సాహసం ప్రారంభమవుతుంది” అనే నినాదంతో బేబీ డ్రస్‌తోపాటుగా, “మామా” అనే పదంలోని లాకెట్టులో రెండోది. “త్వరలో వస్తుంది. నిన్ను కలవడానికి వేచి ఉండలేను నా చిన్ని ప్రియతమా” అంటూ ఇలియానా ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది.

ఇలియానా పోస్టుతో ఒక్కసారిగా ఇన్ బాక్స్ మోత మోగిపోయింది. ఇలియానా పోస్ట్‌లో తండ్రి ఎవరనే ఊహాగానాలతో నిండిపోయింది. స్పష్టంగా చెప్పాలంటే, తాను గర్భవతినా, లేదా దత్తత తీసుకుంటుందా అనే విషయాన్ని వెల్లడించలేదు. “తండ్రి ఎవరు”, “నీకు వివాహం ఎప్పుడు జరిగింది?” అంటూ కామెంట్స్ వరదల వచ్చిపడ్డాయి. ఇలియానా కత్రినా సోదరుడితో డేటింగ్ చేయడం లేదా? అంటే కాట్ అత్త కాబోతోందా? అంటూ ఒక వ్యక్తి రాసుకొచ్చాడు. సంతోషకరమైన విషయమేమిటంటే, చాలా మంది ఇలియానాను సమర్థించారు. పాప డాడీ గురించి అడిగే వారికి వారి సొంత పనులు చూసుకోవాలని హితవు పలికారు. ఇలియానా అన్ని విషయాలను షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, ఇలియానా డి క్రజ్ సోదరి ఫర్రా ఇలా వ్రాసింది, “చాలా సంతోషిస్తున్నాను! ఆగలేను.” ఇక ఇలియానా తల్లి సైతం “నా కొత్త గ్రాండ్ బేబీ ప్రపంచానికి త్వరలో స్వాగతం. అంటూ రాసుకొచ్చింది. “అభినందనలు, అద్భుతమైన వార్త.” అంటూ మలైకా అరోరా, అతియా శెట్టి రాసుకొచ్చారు.

ఇలియానా, కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. మాల్దీవుల్లో జరిగిన కత్రినా పుట్టినరోజు వేడుకల్లో నటి పాల్గొంది. ప్రముఖ చాట్ షో కాఫీ విత్ కరణ్‌లోని ఒక ఎపిసోడ్‌లో, హోస్ట్ కరణ్ జోహార్ కత్రినా కైఫ్‌ను అడిగినప్పుడు, “ఇలియానా వంటి మరికొన్ని బాలీవుడ్ చేరికలు కుటుంబంలో ఉన్నాయి, కానీ వాటిని తాను ధృవీకరించలేనంది” “కానీ మాల్దీవుల పర్యటనలో ఇద్దరూ పార్టీలో మొదటిసారి కలుసుకున్నట్లుగా తెలుసు” అంటూ కరణ్ వ్యాఖ్యానించగా.. అప్పుడు దీనికి కత్రినా కైఫ్ ఆసక్తికరంగా బదులిచ్చారు. “కరణ్ ​​అన్నీ చూస్తాడు. కరణ్ కళ్లు ఏమీ మిస్ అవ్వవు” అని అన్నారు. ఇలియానా చివరిగా ది బిగ్ బుల్‌లో కనిపించింది. తరువాత, ఆమె రణదీప్ హుడాతో కలిసి నటించిన అన్‌ఫెయిర్ & లవ్లీలో కనిపిస్తోంది.