నటుడు విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య
ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కుమార్తె మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. 12వ తరగతి చదువుతున్న మీరా… ఒత్తిడితో పోరాడుతోంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకుంటోంది. మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని తేనాంపేటలోని తన నివాసంలో మీరా ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను మైలాపూర్‌లోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.