మాజీభార్య విషయంలో నటుడు నరేశ్‌కు ఊరట
మాజీభార్య రమ్యరఘుపతితో వివాదం విషయంలో నటుడు నరేశ్‌కు ఊరట లభించింది. ఆమె నరేష్ ఇంటికి వెళ్లకూడదంటూ బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. నటుడు నరేష్, పవిత్ర నటించిన ‘మళ్లీపెళ్లి’ అనే చిత్రాన్ని నిలిపివేయాలంటూ ఆయన మూడోభార్య రమ్య రఘుపతి వేసిన కేసును కోర్టు కొట్టి వేసింది. ఈ చిత్రంలో తనను, తన వ్యక్తిగత జీవితాన్ని అవమానపరిచారని ఆమె కేసు వేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రతో కలిసి ఎలా ఉంటారంటూ మీడియా ముందు కూడా వాదించింది. ఈ చిత్రంలో కంటెంట్ పూర్తిగా కల్పితమంటూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని, అందుకే ప్రైవేట్ వ్యక్తులు వేసిన కేసులు చెల్లవని తీర్పు ఇచ్చింది. నరేష్ బంధువులు వేసిన మరో కేసు విషయంలో కూడా రమ్య రఘుపతికి చుక్కెదురయ్యింది. ఆమె నానక్‌రామ్‌గూడాలో ఉన్ననరేష్ ఇంటికి రాకూడదని నరేష్ బంధువులు కేసు వేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆమె నరేష్ ఇంటికి రాకూడదంటూ తీర్పు ఇచ్చింది.

