దాచుకున్న డబ్బులు చెదలు తినిస్తే..
ఓ కుటుంబం దాచుకున్న డబ్బులు చెదలు తినిస్తే, విషయం తెలుసుకున్న నటుడు లారెన్స్ వారికి తన వంతు సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ‘కూలి చేసుకునే కుటుంబం కష్టపడి సంపాదించిన డబ్బులు చెదలు తినేసిన వార్త నా దృష్టికి వచ్చింది. వారి బాధ నా హృదయాన్ని కలచి వేసింది. వాళ్లు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి అందించడం ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని నా వరకూ తీసుకొచ్చిన మీడియా, ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

