Home Page SliderNational

అనుమానాస్పద రీతిలో నటుడు, దర్శకుడు కౌశిక్ మృతి

నటుడు-దర్శకుడు సతీష్ కౌశిక్ గత రాత్రి ఢిల్లీలోని బిజ్వాసన్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉండగా, అస్వస్థత అని చెప్పడంతో గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రికి చేరుకునే సమయానికి కౌశిక్ మృతి చెందాడు. 66 ఏళ్ల నటుడి మరణంపై ప్రాథమిక దర్యాప్తులో అనుమానాస్పదంగా ఏమీ బయటపడలేదని ఢిల్లీ సౌత్ వెస్ట్ పోలీసు వర్గాలు తెలిపాయి. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు చెప్పారు. స్నేహితులతో కలిసి హోలీని జరుపుకోవడానికి కౌశిక్ నిన్న ఢిల్లీకి వచ్చారు. ముందు రోజు, జావేద్ అక్తర్-షబానా అజ్మీల ముంబై ఇంటిలో జరిగిన హోలీ పార్టీకి హాజరయ్యాడు. ఆ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

పగటిపూట కౌశిక్ ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం అస్వస్థతకు గురైనప్పుడు కౌశిక్ బిజ్వాసన్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా… అప్పటికే చనిపోయాడు. కౌశిక్‌ని ఆసుపత్రికి తరలించిన వారిలో మేనేజర్ సంతోష్ రాయ్ కూడా ఉన్నారు. రాత్రి 10.30 గంటలకు నిద్రపోయాడని.. అర్ధరాత్రి 12.10 గంటలకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఫోన్ చేయడంతో ఆస్పత్రికి తీసుకెళ్లా్మన్నాడు. మొత్తం ఘటనపై ఆస్పత్రి వర్గాలు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కౌశిక్ కుటుంబసభ్యులకు అప్పగించారు.

కౌశిక్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లిన అతని సహచరులతో పోలీసులు టచ్‌లో ఉన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులు, సహోద్యోగులతో కలిసి హోలీ జరుపుకున్న కొన్ని గంటల తర్వాత నటుడు-దర్శకుడు మరణించడం భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. హర్యానాలో పుట్టి కరోల్ బాగ్‌లో పెరిగిన కౌశిక్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి.