Home Page SliderInternational

‘సిటాడెల్’ ట్రైలర్‌లో యాక్షన్ అదరగొట్టిన సమంత

పాన్ ఇండియా నటి సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌లు నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇండియా సిరీస్‌లో దీని పేరు హనీ-బన్నీగా పెట్టారు. ఈ ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్‌లో సమంత అదరగొట్టిందని అభిమానులు సంబరపడుతున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 7 నుండి ఇది విడుదలవుతుంది. గతంలో ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా నటించి మెప్పించారు.