Home Page SliderInternationalPolitics

సిరియాకు తాత్కాలిక అధ్యక్షుడు

సిరియా నియంత బషర్ అల్ అసద్ అంతర్యుద్ధం, తిరుగుబాట్ల కారణంగా సిరియాను వదిలి రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరియాకు తాత్కాలిక అధ్యక్షునిగా తిరుగుబాటు నేత అహ్మద్ అల్ షారాను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని సిరియా మిలటరీ అధికారి హసన్ అబ్దెల్ ఘని తెలిపారు. అయితే షారా ఎంతకాలం పదవిలో కొనసాగుతారన్న సంగతి వెల్లడించలేదు. సిరియా నుండి అంతర్జాతీయ వేదికలపైన కూడా షారానే ప్రాతినిధ్యం వహిస్తారని హసన్ పేర్కొన్నారు.