తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నవీన్‌రావు బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లనుండడంతో ఈ పదవికి ఈ రోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్న నవీన్ రావును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉంచారు. అతి కొద్ది సమయం మాత్రమే ఆయన ఆ పదవిలో ఉంటారు. కేవలం 24 గంటలు మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు నవీన్ రావు. అనంతరం రిటైర్ అవబోతున్నారు. దీనితో రేపటి నుండి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అభినంద్ కుమార్ బాధ్యత తీసుకోబోతున్నారు. పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించేవరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

