Andhra PradeshHome Page Sliderhome page slider

యాసిడ్‌ లీక్‌.. శ్వాస అందక ఇబ్బందిపడ్డ స్థానికులు

ఏపీలోని కర్నూలు నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ లారీ ట్యాంకరు నుంచి హైడ్రో క్లోరిక్‌ యాసిడ్‌ పెద్దఎత్తున లీకైంది. దీనిని గుర్తించిన వాహన డ్రైవరు రహదారిపైనే వాహనం వదిలి దూరంగా వెళ్లిపోయారు. భరించరాని దుర్గంధం వస్తుండటంతో ఆ దారిన వెళ్తున్న ప్రయాణికులు శ్వాస అందక అల్లాడిపోయారు.