Home Page SliderTelangana

భూలక్ష్మి మాత టెంపుల్ అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అకౌంటెంట్‌పై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా ఆలయంలో విధుల్లో ఉన్న అకౌంటెంట్ వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. అనంతరం హ్యాపీ హోలీ అంటూ ఆయన తలపై యాసిడ్ పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తలపై యాసిడ్ పడగానే నర్సింగ్ రావు విలవిలలాడిపోయాడు. నిందితుడు క్యాప్ తో పాటు మాస్క్ పెట్టుకోవడంతో పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.