Home Page SliderNational

పుణె రేప్ కేసు నిందితుడు దొరికాడు..

పుణెలో బస్సులో యువతిపై లైంగిక దాడికి పాల్పడి పరారైన నిందితుడు రాందాస్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి కోసం దాదాపు 13 పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. పుణె సమీప గ్రామాల్లోని చెరుకు తోటలో నిందితుడు దాగి ఉన్నట్లుగా డ్రోన్ సాయంతో గుర్తించారు. ఆ దిశగా అతడి కోసం వేట సాగించారు. అప్పటికే నిందితుడి ఆచూకీ చెప్పినవారికి లక్ష రూపాయల బహుమతిని ప్రకటించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో తీవ్రమైన ఆకలితో నిందితుడు చెరుకు తోటల నుంచి బయటకు వచ్చి ఓ ఇంటికి వెళ్లగా ఇంటి వారు పోలీసులకు రహస్యంగా సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి రాందాస్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అతడు ఇప్పటికే పలు నేరాల్లో జైలులో ఉండి బెయిల్ పై వచ్చినట్టు తెలుస్తోంది.