Home Page SliderTelangana

ఆదిభట్ల ఏటీఎం చోరీ కేసులో నిందితుల అరెస్టు

రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాలలో ఈ నెల 3వ తేదీన జరిగిన ఏటీఏం చోరీ కేసును పోలీసులు చేధించి నిందితులను అరెస్టు చేశారు. నిందితులందరూ హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.మొత్తం పదిమంది ఉండగా అందులో ఆరుగురు అరెస్టు, నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఘటన జరిగిన రోజు కారులో వచ్చి గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను తెరిచిన దోపిడి దొంగలు.. ఏటీఎంలో ఉన్న సుమారు 30 లక్షల రూపాయలను దోపిడీ చేసి పారిపోయారు. ఏటీఎం సెంటర్ల సైరన్ వైర్ ని కట్ చేసి, సీసీ కెమెరాలకు చిక్కకుండా చేసిన దోపిడి దొంగలు.. సుమారు నాలుగున్నర నిమిషాల్లోనే ఏటీఎం చోరీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీం రాజస్థాన్ లోని మేవత్ కు వెళ్లారు. స్థానిక పోలీసుల సహాయంతో నిందితులను అరెస్టు చేశారు. దోపిడి దొంగల నుంచి గ్యాస్ కట్టర్లు, చోరీకి వినియోగించిన మేషిన్ ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.