పార్లమెంట్‌లో రాహుల్‌పై అభియోగాలు..ఎంపీకి గాయాలు
పార్లమెంట్ ప్రాంగణంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య గందరగోళం నెలకొంది. ఈ సమయంలో ఒడిశాకు చెందిన ఎంపీ గాయపడ్డారు. తనను రాహుల్ గాంధీ తోసేశారంటూ ఆయన ఆరోపించారు. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. దీనితో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కిందపడ్డారు. దీనితో ఆయన తలకు గాయమయ్యింది. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఎంపీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ మెట్లపై వస్తూ, తనను తోసేశారని పేర్కొన్నారు. దీనితో రాహుల్ స్పందించారు. నేను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా, బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని, మల్లికార్జున ఖర్గేను కూడా నెట్టేశారని ఆరోపించారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోంది. అంబేద్కర్‌ను అవమానించారు అంటూ రాహుల్ మండిపడ్డారు. ఈ ఘటనపై రాహుల్‌పై ఫిర్యాదు చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది.

