Andhra PradeshHome Page Slider

ఆర్థికశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ అప్పులు ఎంతంటే..?

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక గత ప్రభుత్వం చేసిన అప్పులపై నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ అప్పులపై ఆర్థికశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఆ నివేదికలో ఏపీ అప్పులు రూ.14లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు ఆర్థికశాఖ పేర్కొంది. కాగా ఈ రోజు జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ అప్పులపై కేబినెట్ సభ్యులతో చర్చించనున్నారు. ఈ మేరకు ఏపీ బడ్జెట్‌పై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీలోని వివిధ శాఖల వాస్తవ పరిస్థితులపై చంద్రబాబు ప్రభుత్వం త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేయనుంది.