Home Page SliderNational

లద్ధాఖ్‌లో భారత సైనికులకు ప్రమాదం..5మంది మృతి

లద్ధాఖ్‌లోని దౌలత్ బెగ్ ఓల్డీ అనే ప్రాంతంలో భారతీయ సైనికులకు ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో సైనిక డ్రిల్ చేస్తుండగా టీ-72 యుద్ధ ట్యాంకులతో నది దాటుతుండగా ఒక్కసారిగా వరద వచ్చింది. వీరు ట్యాంకు క్రాసింగ్ అనే సైనిక విన్యాసాలను చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఈ ఘటనలో జవాన్లు పలువురు మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకూ 5గురు జవాన్లు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో ఒక జూనియర్ కమిషనర్ ఆఫీసర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. వారు లేహ్ నగరం నుండి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోత్ అనే ప్రాంతంలో నదిని దాటుతుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన శనివారం తెల్లవారి 4 గంటల ప్రాంతంలో జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.