Andhra PradeshNews

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువైపోయాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమలలో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మొదటి ఘాట్‌లోని రెండో మలుపు వద్ద ఆగి ఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా మరో నలుగురికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం రుయా హస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంలో గాయపడినవారంతా విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.