ఫార్ములా కేసులో ఏసీబీ జోరు..కేటీఆర్ ఇంట్లో సోదాలు
ఫార్ములా ఈ కేసులో ఏసీబీ జోరు పెంచింది. ఈ కేసులో ఏ 1 గా ఉన్న కేటీఆర్ గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో ఇంట్లో నేడు తనిఖీలు మొదలు పెట్టారు. నేటి ఉదయం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కానీ తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో తాను లేనప్పుడు తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. తన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు అయ్యిందని, కానీ ఏసీబీ ఇంతలోనే విచారణకు పిలిచిందని మండిపడ్డారు. ఈ క్వాష్ పిటిషన్‌పై తుది తీర్పు ఇచ్చేవరకూ అరెస్టు చెయ్యొద్దని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
BREAKING NEWS: వైరస్ భయంతో రూ. 12 లక్షల కోట్లు నష్టం

