Home Page SliderTelangana

ప్రభుత్వ పథకాల కోసం లంచం.. ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడులు

ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్ లో సోదాలు చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 పథకాల అమలుకు అధికారులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రూ. 2500 లంచం తీసుకుంటుండగా 23వ వార్డు స్పెషల్ వార్డు ఆఫీసర్ సల్లంటి వినోద్ పట్టుబడ్డారు. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు కోసం బాధితురాలు దరఖాస్తు చేసుకోగా.. వార్డు ఆఫీసర్ లంచం ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఇవాళ వార్డు ఆఫీసర్ ను ట్రాప్ చేసి, మున్సిపల్ ఆఫీస్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.