డీఎస్పీ కార్యాలయం పై ఏసీబీ దాడులు
తెలంగాణలోని సూర్యాపేట డీఎస్పీ కార్యాలయం పై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ మెడికల్ కేసు విషయంలో సూర్యాపేట సీఐ వీర రాఘవులు, డీఎస్పీ పార్థసారథి 25 లక్షలు డిమాండ్ చేశారు. 16 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వారి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడైన తర్వాత డీఎస్పీని, సీఐనీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.