చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబరు 4కి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అక్టోబర్ 3న విచారించనున్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు సైతం విచారణను 4కి వాయిదా వేసింది. తమ వాదనలను ఒకే రోజు ముగించాలని ఇరు పక్షాలను ఆదేశించిన న్యాయమూర్తి, తిప్పి తిప్పి అవే వాదనల విన్పించవద్దని చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబర్ 3కి వాయిదా పడింది. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసు ఈరోజు విచారణకు లిస్ట్ చేయబడింది. జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాల్సి ఉండగా, జస్టిస్ భట్టి ఈ పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా తరఫు కోర్టు దృష్టికి తీసుకెళ్లగా లూథ్రా ఏపీ సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు విన్న సీజేఐ… కేసును వచ్చే మంగళవారం విచారణకు స్వీకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

