Home Page SliderTelangana

బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి ABVP కార్యకర్తల యత్నం

బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడించడానికి ప్రయత్నించారు ABVP కార్యకర్తలు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. వరుసగా రెండురోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విద్యార్థి సంఘాల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీ యాజమాన్యాలు సమధానం చెప్పాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ తమిళిసై నుండి కూడా వీసీకి నోటీస్ వచ్చింది. 48 గంటలలోగా నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు.