తెలుగు విద్యార్థుల సత్తా.. జేఈఈలో ర్యాంకుల పంట
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు దుమ్మురేపారు. ఆలిండియా పరీక్షల్లో ఫస్ట్ పది ర్యాంకుల్లోనే ఐదు ర్యాంకులు సొంతం చేసుకొని ఔరా అన్పించుకున్నారు. వందలోపు ర్యాంకుల్లో పాతిక ర్యాంకులను తెలుగు ధీరులు దక్కించుకున్నారు. ఐఐటీ బాంబే విడుదల చేసిన ఫలితాల్లో తొలి పది ర్యాంకుల్లో 2,4,6,8,10 ర్యాంకులను దక్కించుకొని తిరుగులేదని రుజువు చేశారు. పోలు లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి రెండో ర్యాంకు సాధిస్తే…వంగపల్లి సాయి సిద్ధార్థ్ నాలుగో ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ ఆరో ర్యాంకు, కురుకుండ ధీరజ్ 8 ర్యాంక్, వెచ్చా జ్ఞానమహేష్ పది ర్యాంక్ సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్ మెయిన్స్‌లో మెరిశారు. ఇక ఫస్ట్ ర్యాంక్ బాంబే జోన్ విద్యార్థి ఆర్కే శిశిర్ సొంతం చేసుకున్నారు. శ్రీచైతన్య, నారాయణ విద్యార్థులకు ర్యాంకుల పంటపండింది.
శ్రీచైతన్య విద్యార్థులు సాధించిన ర్యాంకులు

నారాయణ విద్యా సంస్థలు సాధించిన ర్యాంకులు
