Home Page SliderNational

ఐశ్వర్యరాయ్‌ని హగ్ చేసుకున్న ఆరాధ్య, శివ రాజ్‌కుమార్ ఆశీర్వాదం…

ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్‌ని కౌగిలించుకోవడానికి ఆరాధ్య పరిగెత్తి కెళ్లి, శివ రాజ్‌కుమార్ కాళ్లకు కూడా నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. SIIMA 2024 నుండి ఒక కొత్త వీడియోలో, ఆరాధ్య ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న తర్వాత ఐశ్వర్యను హగ్ చేసుకుంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంది. SIIMA 2024లో ఐశ్వర్య రాయ్ ఉత్తమ నటిగా ప్రధాన పాత్రలో (క్రిటిక్స్) అవార్డు అందుకుంది. కొత్తగా వచ్చిన ఫొటోలలో, చియాన్ విక్రమ్‌తో కలిసి స్టేజ్ దిగిన తర్వాత ఆమెను గట్టిగా హగ్ చేసుకోడానికి ఆమె తన తల్లి వైపు పరిగెత్తడం కూడా చూడవచ్చు. దర్శకుడు మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లో తన నటనకు గాను ఐశ్వర్య రాయ్ అవార్డు కార్యక్రమంలో ప్రధాన పాత్రలో (క్రిటిక్స్) ఉత్తమ నటిగా ఎంపికైంది. ఐశ్వర్య, ఆరాధ్య కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కలుసుకుని అతనితో మాట్లాడారు.

ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్ వేదికపైకి వచ్చారు, పొన్నియిన్ సెల్వన్‌లో తమ పాత్రలకు అవార్డులు గెలుచుకున్నారు. వీడియోలో, విక్రమ్ ఐశ్వర్య స్టేజ్ దిగడానికి హెల్ప్ చేయడం చూడవచ్చు. ఐశ్వర్యరాయ్ అవార్డు గెలుచుకున్నప్పుడు, ఆరాధ్య తన మొబైల్ ఫోన్‌లో ఐశ్వర్య ఫొటోలను తీశారు. ఐశ్వర్యరాయ్, ఆరాధ్య, విక్రమ్‌లు ముందు వరుసలో కూర్చుని అవార్డు ప్రదర్శన, ప్రముఖుల నృత్య ప్రదర్శనలను ఆస్వాదించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2, కల్కి కృష్ణమూర్తి రాసిన అదే పేరుతో ఉన్న ప్రసిద్ధ తమిళ సాహిత్య నవల ఆధారంగా తీసిందే. ఐదు భాగాలతో కూడిన ఈ పుస్తకాన్ని మణిరత్నం రెండు పార్ట్‌లుగా చేశారు.