Home Page SlidermoviesNational

ఒకే వేదికపై షారుఖ్ కుమారుడితో ఆరాధ్య బచ్చన్..

ముంబయిలో ఒక విశేష సన్నివేశం చోటు చేసుకుంది. ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలు చదువుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే షారుఖ్, ఐశ్వర్యరాయ్, సైఫ్ అలీఖాన్ వంటి హేమాహేమీలందరూ ఈ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొని సందడి చేశారు. వారి పిల్లల ప్రదర్శనలు చూసి ముచ్చట పడ్డారు. తమ కుమార్తె ఆరాధ్య కోసం అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కలిసివచ్చారు. అలాగే తమ చిన్న కుమారుడు అబ్రం కోసం షారుక్ ఖాన్ భార్యతో కలిసి వచ్చారు. తమ పిల్లల కోసం సైఫ్ అలీఖాన్, కరీనా కూడా వచ్చారు. వారి పిల్లల ప్రదర్శనలు చూస్తూ వాటిని కెమెరాలలో బంధించారు. ఈ ప్రదర్శనలో ఆరాధ్య, షారుక్ కుమారుడు అబ్రంతో కలిసి వేదికపై ప్రదర్శన ఇవ్వడం విశేషంగా మారింది. ప్రదర్శన అనంతరం యాక్టర్స్ కూడా తమ పిల్లలతో కలిసి డాన్సులు చేశారు. ఐశ్వర్య- అభిషేక్ విడాకుల వార్తలు హల్‌చల్ చేస్తున్న వేళ, వీరు కలిసి రావడంతో ఈ రూమర్స్‌కు బ్రేక్ పడింది.