Andhra PradeshHome Page Slidermovies

ఆరా మ‌స్తాన్ అలాంటి సినిమాలే తీయాలి..శ్రీకాంత్

ఏబివిపి మ‌స్తాన్‌గా,ఆరా మ‌స్తాన్‌గా దేశ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులైన సినీ నిర్మాత‌, దేశభక్తి భావ‌జాలికులు, ప్ర‌ముఖ సేవా త‌త్ప‌రులు షేక్ మస్తాన్ త‌న‌తో ఓ మంచి సినిమా చేయ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో శ్రీ‌కాంత్ అన్నారు. విశాఖ‌లో మూడు రోజుల పాటు నిర్వ‌హించిన ఏబివిపి రాష్ట్ర 43వ మ‌హాస‌భ‌ల్లో శ్రీ‌కాంత్‌తో క‌లిసి ఆరా మ‌స్తాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… ఆరా మ‌స్తాన్ 16 ఏళ్ల వయసు నుండే ఏబివిపిలో చురుకుగా పాల్గొని, స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయకుని పాత్ర పోషించార‌ని చెప్పారు. ఆయన నిర్మించిన ‘టెర్ర‌ర్’ సినిమా స‌మాజ హితం కోరి తీసిన మూవీ అన్నారు. ఈ మూవీకి డ‌బ్బులు రావ‌ని తెలిసినా స‌రే, మంచి సినిమా తీయాల‌న్న త‌లంపుతోనే ‘టెర్ర‌ర్’ మూవీ త‌న‌తో చేశార‌ని శ్రీ‌కాంత్ గుర్తు చేసుకున్నారు. భ‌విష్య‌త్‌లో ఆరా మ‌స్తాన్ సినిమాలు చేయాల్సి వ‌స్తే ఇలాంటి మంచి సినిమాలే నిర్మించాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌న్నారు. ఏబివిపికి ఏపిలో దొరికిన ఆరా మ‌స్తాన్ గొప్ప వ్యక్తిత్వం, దేశభక్తి కలిగిన వ్యక్తి అని శ్లాఘించారు. రానున్న కాలంలో ఏబివిపిని బ‌ల‌మైన విద్యార్ధి ప‌రిష‌త్‌గా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త నేటి యువ‌త‌పై ఉంద‌న్నారు.