Breaking NewsHome Page SliderNationalPolitics

నేల‌కొరిగిన ఆప్ శిఖ‌రం

ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఆప్ ని ఓట‌ర్లు చావు దెబ్బ కొట్టారు.అవినీతిపై పోరాడ‌తామ‌ని చెప్పిన పార్టీ చివ‌ర‌కు అవినీతి ఉచ్చులో చిక్కుకుని విల‌విల్లాడి ఓడిపోయింది. దేశాన్ని కుదుపున‌కు గురిచేసిన అర‌వింద రాజ‌కీయం.. నేటి తో స‌మాప్త‌మ‌య్యింది.పార్టీ ,పార్టీ అధినేత రెండూ కుప్ప‌కూలాయి.ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆప్ శిఖ‌రం పూర్తిగా నేల‌కొరిగిపోయింది.ఆప్‌కి కీల‌కంగా ఉన్న నేత‌లంతా ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తుడిచిపెట్టుకుపోయారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పరాజయం పొందారు. బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓటమికి గుర‌య్యారు. 3 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ను ఓడించారు ఢిల్లీ ప్ర‌జ‌లు.