మరోసారి ఢిల్లీ మేయర్‌గా ఆప్ నేత
ఆమ్ ఆద్మీ పార్టీ నేత షెల్లీ ఒబెరాయ్ మరోసారి ఢిల్లీకి మేయర్‌గా ఎన్నికయ్యారు. దేశరాజధాని ఢిల్లీలో రొటేషనల్ పద్దతిలో ఏడాదికి ఒకరిని ఎన్నుకుంటారు. గతంలో ఎన్నికైన షెల్లీ తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నారు.బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఈసారి ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ అమల్లో ఉండడం వల్ల మేయర్ పదవికి మళ్లీ ఒబెరాయ్ పోటీ చేసారు. డిప్యూటీ మేయర్‌గా అలే మహ్మద్ ఇక్బాల్ కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.