ఏపీలో ఆరోగ్య శ్రీ పథకం పేదవాడికి వరం:సీఎం జగన్
సీఎం జగన్ ఈరోజు ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఆరోగ్య శ్రీ పథకంపేదలకు వరం అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4 కోట్ల 25 లక్షలమంది లబ్ది పొందబోతున్నారని సీఎం వెల్లడించారు.కాగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచుతున్నామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా కార్పోరేట్ వైద్యం ప్రజలకు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీలోని 2,513 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదవాడికి ఖరీదైన ఆరోగ్య సేవలు అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డ్‌లు అందేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.