Home Page SliderNational

జలంధర్‌లో కాంగ్రెస్‌ను ఓడించిన ఆప్

జలంధర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకొంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంపై 24 ఏళ్లుగా ఉన్న పట్టును చేధించింది. జలంధర్ లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఆప్ 58,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించింది. చతుర్ముఖ పోటీలో ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకు, తన సమీప ప్రత్యర్థి, భారత్ జోడో సమయంలో మరణించిన సంతోఖ్ చౌదరి భార్య, కాంగ్రెస్‌కు చెందిన కరమ్‌జిత్ కౌర్‌ను ఓడించారు. ఆప్ 3,02,097 ఓట్లను సాధించగా, కాంగ్రెస్‌ 2,43,450 ఓట్లు, అకాలీ-బీఎస్పీ కూటమి 1,58,354 ఓట్లు, బీజేపీ 1,34,706 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. శిరోమణి అకాలీదళ్‌నుంచి బీజేపీలో చేరిన ఇందర్ ఇక్బాల్ సింగ్ అత్వాల్‌ను బీజేపీ రంగంలోకి దించింది. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌విందర్‌ కుమార్‌ సుఖీకి బీఎస్‌పీ మద్దతిచ్చింది. అయినప్పటికీ చతుర్మఖ పోటీలో ఆప్ విజయం సాధించింది. ఓటమిని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ అంగీకరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మరియు దాని అభ్యర్థి సుశీల్ రింకును అభినందించారు.