ఉప ఎన్నికల్లో ఆప్ దూకుడు
నాలుగు రాష్ట్రాల్లోని (గుజరాత్, పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ) 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 19న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఫలితాలు వెలువడ్డాయి.గుజరాత్ లో బీజేపీఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది.పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ పాగా వేసింది. ఆప్ ఆభ్యర్థి సంజీవ్ ఆరోరా 10,637 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.కేరళలోని నిలాంబర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ 11,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థి ఎం.సర్వాజ్‌పై 11,077 ఓట్ల ఆధిక్యంతో షౌకత్ గెలిచారు. షౌకత్‌కు 77,737 ఓట్లు రాగా, స్వరాజ్ (సీపీఎం)కు 66,660 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పీవీ అన్వర్‌కు 19,760 ఓట్లు, బీజేపీ అభ్యర్థి అడ్వకేట్ మోహన్ జార్జికి 8,648 ఓట్లు వచ్చాయి.పశ్చిమబెంగాల్‌లోని కలిగంజ్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీఎంసీ తరుపున అలీఫా అహ్మద్ 50049 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఆశిష్ ఘోష్ పై వివిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్షి కబిల్ ఉద్దీన్ షేక్ 74411 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఆప్ 2 స్థానాల్లో, బీజేపీ ఒకస్థానం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కొక్క స్థానాలను కైవసం చేసుకున్నాయి.

