2020లో నన్ను ముక్కలు చేస్తానని బెదిరించాడు
అఫ్తాబ్ పూనావాలా అసలు రంగు ముందే తెలిసినా శ్రద్ధా వాకర్ నమ్మి మోసపోయినట్టు రుజవయ్యింది.గతంలో ఇద్దరూ నివశించినప్పుడు కూడా గొడవపడేవారని తాజాగా తెలుస్తోంది. గతంలో ఉన్న ఫ్లాట్‌లో కొట్టాడని.. అప్పుడే అతని హింసాత్మక ప్రవర్తన తెలిసిందని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా చేతిలో హత్యకు గైరన శ్రద్ధా పూనావాలా.. అన్నీ తెలిసి కూడా… వంచనకు గరైంది. శ్రద్ధాను దారుణంగా కొట్టి, చంపేసి… 35 ముక్కలుగా మృతదేహాన్ని నరికి, ఢిల్లీలోని అడవిలో పడేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శ్రద్ధా వాకర్ రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని స్వస్థలమైన వసాయ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇద్దరూ నివాసం ఉండే ఫ్లాట్‌లో ఆమెను కొట్టిన తర్వాత, అఫ్తాబ్ హింసాత్మక ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులకు తెలుసని ఆమె పోలీసులకు ఫిర్యాదులో తెలిపింది.


