పాతబస్తీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఇవాళ ఉదయం ఛత్రినాకలో ఓ యువకుడు.. ప్రేమించడం లేదని ఓ యువతిపై కత్తితో గొంతు కోసి, దాడి చేశాడు. పారిపోతున్న యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.