మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి హల్ చల్
మద్యం మత్తులో ఉన్న ఓ యువంతి నడి రోడ్డుపై హల్ చల్ చేసింది. ఈ తంతు భీమవరం పాలకొల్లు హైవేపై జరిగింది. యువతి ఫుల్లుగా మద్యం తాగి వాహనాలకు అడ్డుగా పడుకుంది. దాదాపు 20 నిమిషాలపాటు రోడ్డుకు అడ్డంగా పడుకుని వాహనదారులకు ఆటంకం కలిగించింది. దీంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇబ్బందిపడ్డ వాహనదారులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.