తండ్రి కూతురిని కాల్చి చంపి యువకుడు ఆత్మహత్య
బీహార్‌లోని ఆరా రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు 16 ఏళ్ళ బాలికను, ఆమె తండ్రిని కాల్చి చంపి అనంతరం తాను కూడ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. మృతులంతా ఉద్వాంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మీడియాతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ‘మొదట బాలికను, ఆ తర్వాత ఆమె తండ్రిని కాల్చి చంపాడని, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ముగ్గురూ అక్కడికక్కడే మరణించారని’ ఎస్పీ తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఎస్పీ తెలిపారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారని ఎస్పీ తెలిపారు. ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కేందుకు బాలిక స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

