Home Page SliderNational

ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకేసారి పెళ్లిచేసుకున్న ఘనుడు

రాజస్థాన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకేసారి పెళ్లిచేసుకున్నాడో యువకుడు. పాపం తప్పు అతనిదే అని తీర్మానించేయకండి. హరిఓం అనే వ్యక్తి ఇద్దరిని పెళ్లిచేసుకోవలసి వచ్చింది. ఈయనకు అక్క కాంతతో వివాహం కుదిరిందట. అయితే చెల్లెలు సుమనకి మానసికస్థితి సరిగా లేకపోవడంతో ఆమెపై అతిప్రేమ గల ఆ యువతి ఒక కండిషన్ పెట్టిందట. తన చెల్లెలిని తానే చూసుకోవాలని, జీవితాంతం తాము కలిసి జీవించాలని దీనికి ఒప్పుకుంటేనే పెళ్లి అని చెప్పింది. అంతేకాదు తన చెల్లెలిని కూడా పెళ్లి చేసుకోమని కోరింది. దీనితో ఇరుపక్షాల వారు  చర్చించుకుని, ఒప్పందానికి రావడంతో ఇద్దరు యువతులతో అతని పెళ్లి జరిపించారు. ఈ సంగతి తెలుసుకున్న వారందరూ అతనిని మెచ్చుకుంటున్నారు. ఆమె సోదరి ప్రేమను ప్రశంసిస్తున్నారు.