ఆడు మగాడ్రా బుజ్జి..
ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఆహ్వాన పత్రికల్లో సైతం ఇద్దరు యువతుల పేర్లు ముద్రించి, యువకుడు ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ విచిత్ర పెళ్లి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగింది. లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలను సూర్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి ముగ్గురు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో చేసేదేమీ లేక వారికి పెద్దలు పెళ్లి జరిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.