Home Page Sliderhome page sliderNational

స్నేహితులతో పందెం.. 5 ఫుల్ బాటిళ్లు తాగి యువకుడు మృతి

ఓ యువకుడు స్నేహితులతో కలిసి పందెం కాశాడు. నీళ్లు కలపకుండా 5 ఫుల్ బాటిళ్లు మందు తాగాడు. దీంతో అతడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగిల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి రూ.10 వేల పందెం కాసి.. 5 బాటిళ్ల రా మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో స్నేహితులు హాస్పిటల్‌లో చేర్చించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్తీక్ కు ఏడాది క్రితమే వివాహమైంది. అతడి భార్య వారం రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు స్నేహితులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.