Home Page SliderTelangana

బెట్టింగ్ లో 3 లక్షలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యాయత్నం

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన నిజామాబాద్ మండలం ఆకుల కొండూరులో చోటు చేసుకుంది. ఆకుల కొండూరుకు చెందిన ఆకాష్ అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు 3 లక్షల రూపాయలు నష్టపోయాడు. తీర్చలేని అప్పుల భారంతో మనస్తాపానికి గురైన అతను గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనను గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.