పెళ్ళి పీటలెక్కనున్న యంగ్ హీరో
స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. ‘అల్లుడు శ్రీను’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత ‘జయ జానకి నాయక’, ‘సీత’, ‘రాక్షసుడు’, వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ హిందీ రీమెక్ మెదలయిన సినిమాలలో నటించి మెప్పించాడు. అయితే ఆయన పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతుంది. జనవరి 3న బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పెళ్లి వార్త అఫీషియల్ గా ప్రకటిస్తారనే వార్త వైరల్ అవుతోంది . కాగ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి జనవరి 3 వరకు వేచి చూడాల్సిందే.

