Home Page SliderTelangana

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మహిళ

కరీంనగర్-వరంగల్ హైవేపై ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందపడడంతో ఆమె వెంట్రుకలు లారీ టైర్ కింద ఇరుకున్నాయి. మానకొండూరు మండలం కెల్లడ గ్రామానికి దివ్యశ్రీ భర్త ఇద్దరు పిల్లలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. సింగపూర్ శివారు వద్ద ద్విచక్ర వాహనం నుంచి కింద పడింది. వెనుక నుంచి వస్తున్న లారీ టైర్ కింద ఆమె వెంట్రుకలు ఇరుక్కుని కొద్దిదూరం వెళ్లింది. స్థానికులు కేకలు వేయడంతో గమనించిన డ్రైవర్ లారీని నిలిపివేశాడు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగి దివ్యశ్రీకి ధైర్యం చెప్పాడు. బండి సూచన మేరకు మహిళ జుట్టును కత్తిరించి ఆమెను కాపాడారు. మహిళను కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దివ్యశ్రీ ఖర్చును తానే చెల్లిస్తానని ఆస్పత్రి వైద్యులకు బండి సంజయ్ తెలియజేశారు. మహిళా ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.