కూకట్‌పల్లిలో లవర్‌తో కలిసి భర్తను చంపిన భార్య
గతవారం కూకట్‌పల్లి జిమ్‌ట్రైనర్ జయకృష్ణ మృతి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో భార్య దుర్గ, ప్రియుడితో ప్లాన్ చేసి భర్త హత్యకు కుట్ర చేసిందని పోలీసులు తేల్చారు. గతవారం ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో జయకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ మృతిపై అతని తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో కేసు చేపట్టారు పోలీసులు. దగ్గరి బంధువైన చిన్నా అనే వ్యక్తితో జయకృష్ణ భార్యకు ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణం అని తేల్చారు. జయకృష్ణ వీరి అక్రమ సంబంధం పసిగట్టి, కుటుంబాన్ని హైదరాబాద్ నుండి సొంతూరుకు తరలిద్దాం అనే ఉద్దేశ్యం కనపరచడంతో వీరిద్దరూ ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. హత్యకు ముందు చిన్నా జయకృష్ణను లిక్కర్ తాగించి, ఆపై పెట్రోల్ పోసి కాల్చినట్లు కనిపెట్టారు. చిన్నాను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

